కరోనా చికిత్సకు మరో కొత్త ఔషధం!

కరోనా చికిత్సకు మరో కొత్త ఔషధం అందుబాటులోకి రానుంది. అమెరికా, బ్రిటన్ దేశాల్లో జంతువులు, మనుషులపై ట్రయల్స్ పూర్తి చేసుకున్న మోల్నుఫిరావిర్-400 ఎంజీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధమైంది. మన దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‍లోని యశోద ఆస్పత్రిలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ లింగయ్య తెలిపారు. నాట్కో ఫార్మాతో కలిసి యశోయ ఆస్పత్రిలో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడో దశలో దేశ్యవాప్తంగా 34 ఆస్పత్రుల్లో 1,218 మందిని ఈ ట్రయల్స్ కు ఎంపిక చేయగా, యశోద ఆస్పత్రిలో 50 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ బారిన పడి మైల్డ్ సింప్టమ్స్తో బాధపడుతున్న 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారిని ఇందుకు ఎంపిక చేయనున్నారు.