ఆ వేరియంట్ వల్ల పెను ప్రమాదం…డబ్ల్యూహెచ్ వో వార్నింగ్

కొత్త కరోనా వేరియంట్ బి.1.1.529 (ఒమిక్రాన్)తో రిస్క్ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిరచింది. ఇప్పటికే ఆ వైరియంట్ పట్ల ప్రపంచ దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో భయానక విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆ వేరియంట్ వల్ల పెను ప్రమాదం పొంచి ఉన్నట్లు చెప్పింది. అయితే ఆ వేరియంట్ వ్యాప్తిస్తున్న తీరు, అది ఎంత ప్రమాదకరమన్న విషయం అస్పష్టంగా ఉన్నట్లు కూడా డబ్ల్యూహెచ్ వో వెల్లడిరచింది. ఒక వేళ ఒమిక్రాన్ వేరియంట్ వల్ల వైరస్ హెచ్చు స్థాయిలో ప్రబలితే, దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డబ్ల్యూహెచ్‌వో తన టెక్నికల్ నోట్‌లో తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఒమిక్రాన్ వల్ల మరణాలు రికార్డు కాలేదు.