కరోనా కట్టడికి మరో టీకా

కరోనా వైరస్ కట్టడికి మరో టీకా అందుబాటులోకి వచ్చింది. నొవావాక్స్ టీకా అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌ఓ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికా సంస్థ నొవావాక్స్ టీకా తయారు చేస్తోంది. భారత్‌లో దీనికి కొవావాక్స్ అనే పేరుతో సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు ఈ టీకా గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ సిస్టమ్ కొవాక్స్‌లో భాగంగా పంపిణీ కానుంది. టీకాలు అత్యంత ప్రభావవంతమైన సాధనాల్లో ఒకటి అని డబ్ల్యూహెచ్‌వో సీనియర్ అధికారిణి మరియాం జెలో సిమావ్ తెలిపారు. నొవావాక్స్ టీకా వినియోగానికి అనుమతి కోరుతూ డబ్ల్యూహెచ్‌వోకు దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యిందని గత నెలల్లోనే సీరం వెల్లడిరచింది.