సెకండ్ వేవ్ మాత్రమే కాదు.. మూడు, నాలుగు వేవ్‍లు

భారత్‍లో కరోనా సెకండ్ వేవ్ మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో మూడు, నాలుగు వేవ్‍లను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. ప్రజలు వైరస్ గురించి ఆందోళన చెందకుండా ప్రభుత్వాలకు సహకరించాలని అన్నారు. కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే ఔషధాల కొరతను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రెమ్‍డెసివిర్‍కు పెరుగుతున్న డిమాండ్ రీత్యా వార్ధాలో 30 వేల డోస్‍ల ఉత్పత్తిని పెంచనున్నట్లు తెలిపారు. దేశ ప్రజానీకమంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.