కలిసి నిద్రించొద్దు.. ముద్దులు పెట్టుకోవద్దు

చైనాలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక కేంద్రమైన షాంఘై నగరంలో ప్రజలకు కలిసి నిద్రించ వద్దు, కౌగిలింతలు, ముద్దులు పెట్టుకోవద్దు అంటూ ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాకుండా కొవిడ్ ప్రబలకుండా పరిమితులు పాటించాలని కోరుతూ డ్రోన్ల ద్వారా పర్యావేక్షిస్తున్నారు. ఇంటి కిటికీలనూ తెరువొద్దని కోరారు. ఈ రాత్రి నుంచి జంటలు విడివిడిగా పడుకోవాలి. ముద్దులు పెట్టుకోవద్దు. కౌగిలింతలు అనుమతించం. విడిగా తినాలి. ఆంక్షలు పాటిస్తున్నందుకు ధన్యవాదాలు అని ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు హౌసింగ్ సొసైటీ నివాసితులకు తెలిపారు.