యాంటిబాడీలను గుర్తించే కొత్త పరికరం : అమెరికా

కరోనా యాంటీబాడీలను నిమిషాల వ్యవధిలో గుర్తించే కొత్త పరికరాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సార్స్-కొవ్-2తో పాటు కరోనా రకానికి చెందిన మరో నాలుగు వైరస్‍లను కట్టడి చేసే యాంటిబాడీలను 100 శాతం కచ్చితత్వంతో ఈ పరికరం గుర్తిస్తుందని డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. పాలిమర్ బ్రష్ కోటింగ్ సాంకేతికత సాయంతో పనిచేసే ఈ పరికరంలో రోగి ఒక చుక్క రక్తం, ఒకరకమైన బయోమాలిక్యులర్ లూబ్రికెంట్ ద్రావణాన్ని వేస్తే, నిమిషాల వ్యవధిలో రోగి శరీరంలో యాంటీబాడీల స్థాయిలు తెలుస్తాయన్నారు. రోగిలో కరోనా తీవ్రతను దీని సాయంతో సులభంగా తెలుసుకోవచ్చన్నారు.