భారత్ లో ఈ వైరస్ వ్యాప్తి చెందితే హాస్పిటల్స్ పుల్ అయిపోతాయంట!

బ్రిన్‍లో వెలుగుచూసిన స్ట్రెయిన్ 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో… ఒకవేళ భారత్ లో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ నమోదైతే దేశంలో ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతాయి. ఫలితంగా మన హెల్త్ కేర్ వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ దేశంలో ఎక్కడైనా కొత్త స్ట్రెయిన్ని గుర్తిస్తే వెంటనే దాని వ్యాప్తిని అడ్డుకునే చర్యలు చేపట్టాలని వారు కోరారు.
కరోనా పాజిటివ్‍గా నిర్దారణ అయిన 20 మంది యూకె రిటర్నీస్ దేశంలో కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్ వ్యాప్తికి క్యారియర్స్ గా మారవచ్చునని ఇటీవల యూకె నుంచి వచ్చినవారిలో 20 మందికి కరోనా పాజిటివ్‍గా నిర్దారణ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం యూకెలో 60శాతం కేసులు కొత్త స్ట్రెయిన్ కారణంగానే నమోదవుతున్నాయి. ఆ లెక్కన భారత్‍లో కరోనా పాజిటివ్‍గా తేలిన 20 మంది యూకె రిటర్నీస్‍లో కనీసం సగం మంది కొత్త స్ట్రెయిన్ బారినపడి ఉంటారు. ఇలా జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది.’ అని హైదరాబాద్‍లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్, సైంటిస్ట్ డా.రాకేష్ మిశ్రా పేర్కొన్నారు.
తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన యూకె రిటర్నీస్ ను మాత్రం ప్రత్యేకంగా క్వారెంటైన్ లో ఉంచాలని గత కొద్దివారాల్లో యూకె నుంచి వచ్చినవాళ్లందరినీ ట్రాక్ చేయాలి.ఒకవేళ వారికి పాజిటివ్ గా తేలితే వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించాలని అంతేకాదుదేశంలోని ప్రధాన నగరాల్లో కొత్తగా నమోదవుతున్న కేసుల్లోనూ వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించాలని అలా అయితే కొత్త రకం వైరస్ ఇదివరకు వ్యాప్తిలో ఉందా లేదా అన్నది తెలుస్తుందని డా.మిశ్రా తెలిపారు. వైరస్ లు రూపాంతరం చెందడం సర్వ సాధారణం. పైగా వైరస్ లు వేగంగా రూపాంతరం చెందుతుంటాయి అని అయన తెలిపారు.