ఒక్క సెకను లోనే.. కరోనా పరీక్ష

అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు బయో సెన్సర్ ఆధారంగా ఒక్క సెకనులోనే కరోనా పరీక్ష జరిపే విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ విధానంలో రసాయనిక చర్య ద్వారా రెండు ఎలక్ట్రోడులను అనుసంధానం చేసి సర్క్యూట్ బోర్డుకు కరెంటును పంపడం ద్వారా లాలాజలంలో కరోనా యాంటీబాడీలను గుర్తిస్తారు. దీనిలో ఒక వైపు బంగారు పూత పూసిన ఎలక్ట్రోడు ఉంటుంది. విద్యుత్తు సరఫరా అయినప్పుడు కరోనా యాంటీ బాడీలు ఈ పూతకు అతుక్కొనేలా రసాయన వ్యవస్థ ఉంటుంది. ఈ పూతకు అంటుకొన్న కరోనా యాంటీ బాడీల స్థాయిని యంత్రంలోని డిజిటల్ బోర్డు తెలుపుతుంది. దీన్ని బట్టి వైరస్ లోడ్‍ను అంచనా వేస్తారు.