దేశంలో విస్తరిస్తున్న కొత్త రకం కరోనా

కోవిడ్-19 కట్టడికై వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ మహమ్మారి రూపం మార్చుకుని మరోసారి బెంబేలెత్తిస్తోంది. దేశంలో విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‍ను శాస్త్రవేత్తలు గుర్తించారున. ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఇక కొత్తరకం వైరస్‍కు ఎన్440కె(చీ440ఖ)గా నామకరణం చేశారు. దీనికి యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే లక్షణం ఉన్నట్లు తెలిపారు. కాగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో దీని ఉనికిని గుర్తించారు. అదే విధంగా నోయిడాలో కోవిడ్ రీ ఇన్‍ఫెక్షన్ కేసు (కొత్తరకం)ను గుర్తించినట్లు సమాచారం.