బ్లాక్ ఫంగస్ కు మరో ఔషధం..

కరోనా సెకండ్ వేవ్‍తో గజగజవణుకుతున్న భారతదేశాన్ని బ్లాక్ ఫంగస్ మరింత కలవరానికి గురి చేస్తోంది. క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వస్తుండటంతో వైద్య రంగంలోని వారితో పాటు ఫార్మారంగంలోని వారు కూడా వ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. హైదరాబాద్‍కు చెందిన ఎంఎస్‍ఎన్ లాబరెటరీస్ బ్లాక్ ఫంగస్‍కు కొత్త మందును తీసుకు వచ్చినట్లు ప్రకటించింది. యునానీ మందుల ద్వారా వ్యాధివి నయం చేయవచ్చని ఆయుష్ సంచాలకులు ప్రకటించిన కొన్ని గంటల్లోనే మరో మందు అందుబాటులోకి రావడం కొంత ఉపశమనం కలిగించే అంశమని పలువురు అంటున్నారు. పోసా వన్ బ్రాండ్ పేరుతో 100 ఎంజీ టాబ్లెట్లు, 300 ఎంజీ ఇంజక్షన్‍లను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు సంస్థ ప్రకటించింది.