ఇద్దరు ఎంపీలకు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలోని ఇద్దరు ఎంపీలు కరోనా బారిన పడ్డారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కోమటిరెడ్డి ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కొవిడ్ సోకినట్లు అనుమానంగా ఉందని తెలిపారు. అలాగే జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కొవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం తాము ఆరోగ్యంగానే ఉన్నామని ఎంపీలు తెలిపారు. వారం రోజులుగా తమతో కాంటాక్ట్ ఉన్న వ్యక్తులు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.






