పిల్లల కోసం సిద్దమైన రెండు వ్యాక్సిన్లు…

కరోనా వ్యాప్తి కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో పిల్లలకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తేవడం అత్యవసరం. ఈ దిశగా అమెరికాలో నిర్వహించిన ప్రాథమిక దశ ప్రయోగ పరీక్షల్లో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. ఇందులో భాగంగా మోడెర్నా వ్యాక్సిన్‍తో పాటు నేషనల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్లియస్ డిసీజెస్ (ఎన్‍ఐఏఐడీ) అభివృద్ధి చేసిన ప్రొటీన్ ఆధారిత టీకాలను 22 నెలల వయసున్న 16 కోతి పిల్లలపై పరీక్షించారు. వీటి ప్రభావంతో కోతిపిల్లలో యాంటీబాడీలు భారీ సంఖ్యలో విడుదలయ్యాయి.