కావలి ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి మూడేళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు చేయగా కరోనా సోకినట్లుగా గుర్తించారు. అలాగే పాదయాత్రలో ఎమ్మెల్యేతో పాటు విస్తృతంగా పాల్గొంటున్న కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.సుకుమార్‌రెడ్డికి వైరస్ సోకినట్టు నిర్ధారించారు. ఎమ్మెల్యే చికిత్స కోసం చెన్నైలోని అపోలో వైద్యశాలలో చేరారు.






