త్వరలో కరోనాను గుర్తించే యాప్!

అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు స్మార్ట్‌ఫోన్‌తో కొవిడ్-19ను గుర్తించే అల్గోరిథంను అభివృద్ధి చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో ఈ టెక్నాలజీని సిద్ధం చేశారు. ఈ అల్గోరిథం దగ్గుతో బాధపడుతున్న రోగుల్లో 98.5 శాతం కొవిడ్-19 ఇన్‌ఫెక్షన్లను.. అసింప్టోమాటిక్ కేసులతో బాధపడుతున్న వారిలో వంద శాతం విజయవంతంగా గుర్తించిందని చెప్పారు. స్మార్ట్ ఫోన్లో ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి బదులుగా యాప్ నిర్మాణం పరిశోధకులు దృష్టి సారించారు. యాప్ అందుబాటులోకి వస్తే ఏ ప్రదేశంలోనైనా తక్షణమే కొవిడ్‌ను గుర్తించవచ్చు. ఈ యాప్‌ను వీలైనంత త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధకులు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తున్నది.
ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన పక్షంలో పాఠశాలలు, కాలేజీలు, కంపెనీలు తిరిగి ప్రారంభమైన సమయంలో పెద్ద పెద్ద సమూహాల్లో వీలైనంత తొందరగా కొవిడ్‌ను గుర్తించి తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలు చిక్కుతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఆధారిత తక్షణ కొవిడ్ -19 పరీక్షలు అందుబాటులోకి వస్తే లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడేందుకు వీలు లభిస్తుంది. రెగ్యులేటరీ ఆమోదం పెండింగ్‌లో ఉన్న ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని యాప్‌గా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎంఐటీ పరిశోధకులు భావిస్తున్నారు.