కరోనా టీకా తీసుకున్న మంత్రి ఈటల రాజేందర్

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా టీకా వేయించుకున్నారు. హుజూరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రిలో ఆయన టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ లేదని సృష్టం చేశారు. భారత ప్రభుత్వం ఆదేశానుసారం నేటి నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 45 సంవత్సరాలు పైబడి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వాళ్లకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఎంపిక చేసిన కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, ఒక్క డోస్‌కి రూ.250 ఉండనున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ విషయంలో అపోహలు నమ్మొద్దని కోరారు. అర్హులు రిజిస్ట్రేసన్ చేసుకొని అందుబాటులో ఉన్న ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.