కొవిడ్ కు త్వరలో మరో ఔషధం!

కొవిడ్ చికిత్సకు సరికొత్త ఔషధమొకటి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్ జన్యు కోడ్‌లలో మార్పులు చేయడం ద్వారా మహమ్మారి తీవ్రతకు కళ్లెం వేయగల యాంటీవైరల్ మందుబిళ్ల (మాత్ర)ను తాము అభివృద్ధి చేసినట్లు అమెరికాకు చెందిన మెర్క్ అండ్ కో ఫార్మా సూటికల్ కంపెనీ తెలిపింది. మాల్నుపిరవిర్ గా దానికి నామకరణం చేసినట్లు వెల్లడిరచింది. కొవిడ్ బారిన పడ్డవారు ఆస్పత్రిపాలయ్యే అవకాశాలను, మృత్యువాతపడే ముప్పును ఈ మాత్ర సగం మేరకు తగ్గిస్తుందని పేర్కొంది. దాని అత్యవసర వినియోగానికి త్వరలోనే అనుమతులు కోరనున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా సహా అన్ని రకాల కరోనా వైరస్‌లపై ఈ ఔషధం సమర్థంగా పనిచేస్తోందని వివరించింది. మాల్పు పిరవిర్ విపణీలో అందుబాటులోకి వస్తే కొవిడ్ వ్యాధికి నోటిద్వారా తీసుకునేందుకు వీలున్న (ఓరల్) తొలి యాంటీవైరల్ ఔషధం ఇదే అవుతుందని పేర్కొంది.