కేరళ సీఎంకు కరోనా పాజిటివ్

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కొవిడ్-19 ఇన్ఫెక్షన్‍కి గురయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యాందనీ, అయితే కరోనా లక్షణాలేవీ ఆయనలో కనిపించడం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన కాన్నూర్‍లోని తన నివాసంలోనే ఉన్నారని తెలిపాయి. ప్రస్తుతం ఆయనకు కరోనా లక్షణాలు లేవు. అయితే త్వరలోనే ఆయనను కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించే అవకాశం ఉంది అని సీఎంవో వర్గాలు పేర్కొన్నాయి. మార్చి 3న ఆయన వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నారు. అయినా తాజాగా పరీక్షలో పాజిటివ్ వచ్చింది.