భారత్ లో ఈటా వేరియంట్

కొత్త రూపాలతో విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారికి సంబంధించిన మరో వేరియంట్ భారత్‍లో తొలిసారిగా వెలుగుచూసింది. కర్ణాటకలోని మంగళూరులో ఈటా వేరియంట్ (బీ.1.525) కేసును గుర్తించినట్టు అధికారులు తెలిపారు. బ్రిటన్, నైజీరియాలో గత ఏడాది డిసెంబర్‍లో ఈటా వేరియంట్‍ను తొలిసారిగా గుర్తించారు. గత ఫిబ్రవరి నాటికి బ్రిటన్, డెన్మార్క్, నైజీరియాలో పదుల సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.