సుప్రీం జడ్జి జస్టిస్ చంద్రచూడ్‍కు కరోనా

సుప్రీంకోర్టు జడ్డి డి.వై. చంద్రచూడ్‍కు కరోనా సోకింది. ఆయనతో పాటు ఆయన సిబ్బందిలో ఒకరికి కూడా కరోనా సోకింది. జస్టిస్ చంద్రచూడ్ కరోనా నుంచి కోలుకుంటున్నారని కోర్టు వర్గాలు తెలిపాయి. అయితే ఆయన నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని రోజుల పాటు సమావేశం కాకపోవచ్చని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా దేశంలో కరోనా సంభోభానికి సంబంధించిన అంశాలను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం లోని సుప్రీం కోర్టు ధర్మాసనం విచారిస్తుంది. ఈ మేరకు వచ్చిన పిటిషన్లను నేడు విచారించవలసి ఉంది. కానీ చంద్రచూడ్ అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా పడవచ్చు.