ఒక్క డోసుతో కొవిడ్ నుంచి రక్షణ!
ఒకే ఒక్క డోసుతో కొవిడ్ 19 నుంచి రక్షణ కల్పించగల సామర్థ్యమున్న టీకాను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ కృషి చేస్తోంది. మావవులపై ఆ టీకా తుది దశ ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అమెరికా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూల్లో మొత్తం 60 వేల మంది వాటంటీర్లకు దాన్ని అందించనున్నారు. సాధారణంగా ఏదైనా టీకా నుంచి ఫలితాలనివ్వాలంటే కనీసం రెండు డోసులను తీసుకోవాల్సి ఉంటుందని, అందుకు భిన్నంగా ఒకే ఒక్క డోసుతో కరోనా నుంచి రక్షణ కల్పించేలా తమ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశామని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రధాన శాస్త్రీయ అధికారి డాక్టర్ పాల్ స్టోఫెన్స్ తెలిపారు.






