జో బైడెన్ కు నెగెటివ్…
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న జో బైడెన్‌కు, ఆయన భార్య జిల్ ట్రేసీ జాకొబ్ బైడెన్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఆ పరీక్షలో ఇద్దరికీ నెగటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు కరోనా సోకినట్లు తేలడంతో బైడెన్ దంపతులకు కూడా పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ కెవిన్ ఓ కానర్ తెలిపారు. రెండు రోజుల క్రితమే ట్రంప్, బైడెన్ల మధ్య చర్చా కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. కరోనా నెగటివ్ అని తేలడంతో ప్రచార కార్యక్రమాలను కొనసాగించాలని బైడెన్ నిర్ణయించారు. ప్రచారంలో భాగంగా ఆయన మిషిగన్‌కు వెళ్లనున్నారు.






