18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ : జో బైడెన్

ఏప్రిల్ 19 నుంచి అమెరికాలో 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి కోవిడ్ టీకా ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. మరో రెండు వారాల్లో ప్రజలందరికీ టీకా అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ అధికారం చేపట్టిన 75 రోజుల్లోనే సుమారు 15 కోట్ల మందికి కోవిడ్ టీకా పంపిణీ చేసినట్లు తెలిపారు. మహమ్మారి నుంచి సురక్షితంగా ఉండేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలను పాటించాలని ఆయన అమెరికన్లను కోరారు. ఆర్థిక నగరమైన కాలిఫోర్నియాలో జూన్ 15 నాటికి అన్ని వ్యాపారాలను తిరిగి తెరుస్తామని హామీ ఇచ్చారు.
గతంలో మే ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు దాటిన వారికి టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బైడెన్ తెలిపారు. కానీ ఆ టార్గెట్ డెడ్‍లైన్‍ను ముందుకు మార్చినట్లు ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్ పోగ్రామ్ జోరుగా సాగుతోందన్నారు. వ్యాక్సిన్ అందుబాటు కూడా ఈజీగా ఉందని, 15 కోట్ల మందికి టీకా ఇచ్చిన తొలి దేశం మనదేనని తెలిపారు. ఆరు కోట్ల మంది పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.