దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు మూడు లక్షల వరకు నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా రెండు లక్షలకు దిగువన నమోదయ్యాయి. మరణాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 20,58,112 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,96,427 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 14 తర్వాత ఆ స్థాయిలో తగ్గుదల కనిపించడం ఇదే మొదటిసారి. తాజాగా 3,511 మంది వైరస్ బారినపడి ప్రాణాలు వదిలారు. 24 గంటల్లో 3,26,850 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,69,48,874కు పెరగ్గా.. 2,40,54,861 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,07,231 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 25,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. మరోవైపు టీకా డ్రైవ్‍లో భాగంగా 19,85,38,999 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.