ప్రపంచంలోనే భారత్ కు మూడో స్థానం…

భారత్ ఓ విషాదకర మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు కరోనాతో 5 లక్షల మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఈ స్థాయిలో కరోనా మరణాలను నమోదు చేసిన దేశం మనదే. ప్రపంచంలో అమెరికాలో అత్యధికంగా 9.2 లక్షల మంది వైరస్‌తో మృతి చెందారు. తర్వాత స్థానం బ్రెజిల్ (6.3 లక్షలు ) ఉంది. భారత్‌తో ప్రస్తుత మరణాల సంఖ్య 5,00,055. గడిచిన 24 గంటల్లో కొత్త 1,49,394 కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 4,19,52,712కు చేరుకున్నాయి. క్రియాశీలక కేసులు 14,35,569కు తగ్గాయి. దేశంలో 15-18 ఏళ్ల మధ్య నున్న వారిలో 65 శాతం తొలి టీకా డోసు తీసుకున్నారని, రెండో డోసును అర్హులైన 34.90 లక్షల యవ్వనులు అందుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.