కరోనా నియంత్రణలో హైదరాబాద్ కీలకం : యూఎస్ కాన్సుల్ జనరల్
కరోనా నియంత్రణలో హైదరాబాద్ నగరం కీలకం కానుందని హైదరాబాద్ యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్ అన్నారు. హైదరాబాద్‌తో అమెరికా బంధం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) బుధవారం భారత్-అమెరికా సంబంధాలపై యూఎస్ కాన్సుల్ జనరల్, అధికారులతో ఆన్లైన్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జోయల్ రీఫ్‌మన్ మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో అమెరికా-భారత్ ఐక్యంగా పనిచేశాయని ప్రశంసించారు. ఎఫ్‌టీసీసీఐ చైర్మన్ రమాకాంత్ ఇనానీ మాట్లాడుతూ ప్రపచంవ్యాప్తంగా కరోనా కట్టడిలో హైదరాబాద్ కీలకమని అన్నారు. ఔషధాలు, వ్యాక్సిన్లు రాజధానిలోనే ఉత్పత్తి అవుతాయని, వాటిని తక్కువ ధరకే ప్రపంచానికి అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్ ఫార్మా సంస్థలు గ్లోబుల్ లీడర్లుగా అవతరించాయని చెప్పారు. కరోనా తర్వాతి దశకు భారత్ సిద్ధమవుతున్నదని, ఇందులో హైదరాబాద్ కీలక పాత్ర పోషించబోతున్నదని ఎఫ్‌టీసీసీఐ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిటీ చైర్మన్ రాజేంద్ర అగర్వాల్ చెప్పారు.






