మే 1 నాటికి భారత్ కు స్పుత్నిక్-వి

రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి డోసుల మొదటి బ్యాచ్ మే 1న భారత్‍కు చేరనుంది. ఈ విషయాన్ని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సీఈవో కిరిల్ దిమిత్రీవ్ వెల్లడించారు. మొదటి బ్యాచ్ లో ఎన్ని డోసులు ఉంటాయి? అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఏటా 85 కోట్ల డోసుల ఉత్పత్తికి భారత్‍లోని ఐదు ప్రముఖ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రష్యా నుంచి దిగుమతి కానున్న తొలి 1.25 కోట్ల డోసులను భారత్‍లో పంపిణీ చేసే బాధ్యతను హైదరాబాద్‍కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నిర్వర్తించనుంది.