ప్రపంచంలోనే భారత్ కు మూడో స్థానం…

భారత్‍లో కరోనా సోకి ప్రాణాలు కోల్పోతున్న పాత్రికేయులు అధికమవుతున్నారు. కరోనా కారణంగా సంభవించిన జర్నలిస్టుల మరణాల్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. తాజాగా జెనీవాకు చెందిన ది ప్రెస్ ఎంబ్లేమ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కరోనా కారణంగా సంభవించిన జర్నలిస్టుల మరణాల్లో బ్రెజిల్ (181), పెరూ (140), భారత్ (107) టాప్-3లో ఉన్నాయి. భారత్‍లో గత రెండు వారాల్లోనే 45 మంది జర్నలిస్టులు చనిపోయారు. ఆ సంఖ్య 114కు పెరిగిందని నివేదికలో పేర్కొంది. భారత్ తర్వాతి స్థానంలో మెక్సికో (106), అమెరికా (47), ఇటలీ (52), బంగ్లాదేశ్ (51), కొలంబియా (49) లు ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇప్పటివరకు 76 దేశాల్లో మొత్తం 1184 మంది జర్నలిస్టులు కరోనాతో మరణించారు.