దేశంలో కొత్తగా 2,57,299 కేసులు…

దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరోసారి మరణాలు నాలుగువేలకు పైగా నమోదయ్యాయి. ఇటీవల కొత్త కేసులు తగ్గుతున్నా, మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 20,66,285 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,57,299 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,62,89,290కు చేరింది. 4,194 మంది కోవిడ్‍తో మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు 2,95,525 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 3,57,630 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 2,30,70,365 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 29,23,400 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 19,33,72,819 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.