భారత్‍లో ఉన్న పరిస్థితిపై.. డబ్ల్యూహెచ్వో ఆందోళన

భారత్‍లో ఉన్న కొవిడ్ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍వో) ఆందోళన వ్యక్తం చేసింది. జెనీవాలో డబ్ల్యూహెచ్‍వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియేసిస్ మీడియాతో మాట్లాడుతూ భారత్‍లో అనేక రాష్ట్రాలో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయని అన్నారు. చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారని, మరణాలు కూడా అధికంగానే చోటు చేసుకుంటున్నట్లు తెలిపారు. భారత్‍లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఉధృతిని అడ్డుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకరిస్తోందని అన్నారు. ఇప్పటికే ఆ దేశానికి వేల సంఖ్యలో ఆక్సిజన్ కాన్‍సెంట్రేటర్స్ ను సరఫరా చేసినట్లు తెలిపారు. మొబైల్ హాస్పిటళ్లకు టెంట్ లు, మాస్క్ లు, ఇతర మెడికల్ సామాగ్రిని పంపినట్లు చెప్పారు. ఇండియాకు సపోర్ట్ ఇస్తున్న అన్ని దేశాలకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. ప్రపంచ దేశాలకు టెడ్రోస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మహమ్మారి సోకిన తొలి ఏడాది కన్నా రెండవ ఏడాది మరింత ప్రమాదకరంగా ఉంటుందని అన్నారు. మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆయన హెచ్చరించారు.