24 గంటల్లో 48,268 పాజిటివ్ కేసులు
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం 40 వేలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 48,268 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,37,119కు చేరింది. నిన్న ఒక్క రోజే 551 మంది మరణించగా ఇప్పటి వరకు మొత్తం 1,21,641 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న 59,454 మంది కోలుకుని అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 74,32,829 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,82,649గా ఉంది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 91.34 శాతంగానూ.. నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 7.16 శాతంగా ఉంది. మరణాల రేటు 1.49 శాతానికి తగ్గింది.






