దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. వరుసగా రెండు రోజులు తగ్గిన కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. దీంతో మరోసారి 3.5 లక్షలు దాటాయి. అదేవిధంగా మరణాలు కూడా నాలుగు వేలకు పైనే నమోదయ్యాయి. 24 గంటల్లో 18,64,594 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 3,62,727 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,37,03,665కు పెరిగింది. దేశంలో ఒక్కరోజులోనే ఏకంగా 4,120 మంది కొవిడ్‍తో మరణించారు. దీంతో కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,58,317కు చేరింది. దేశంలో మొత్తం 1,97,34,823 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇంకా 37,10,525 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 17,72,14,256 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.