దేశంలో కాస్త తగ్గిన కరోనా తీవ్రత… 24 గంటల్లో

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 18,50,110 మంది వైరస్ పరీక్షలు చేయించుకోగా 3,29,942 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,92,517 పెరిగింది. కొత్తగా 3,56,082 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,90,27,304 మంది కోలుకున్నారు. మరో 3,876 మంది మృత్యువాతపడగా, మహమ్మారి బారినపడి మొత్తం 2,49,992 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 37,15,221 యాక్టివ్ కేసులున్నాయి.