కాస్త తగ్గిన కరోనా ఉధృతి… కొత్తగా 2.5 లక్షల

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గింది. కానీ మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటలలో 2,59,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,60,31,991కు చేరింది. గడిచిన 24 గంటలలో 4,209 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 2,91,331కు చేరింది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 3,57,295 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 30,37,925 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటలలో దేశ వ్యాప్తంగా 20,61,683 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది. 19.18 కోట్ల మందిపైగా వ్యాక్సిన్ వేసినట్లు స్పష్టం చేసింది. దేశంలో యాక్టివ్ కేసులు 11.63 శాతం, మరణాల రేటు 1.12 శాతం ఉన్నట్లు తెలింది.