దేశంలో కరోనా విజృంభణ..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 23,285 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,08,846కు పెరిగింది. కొత్తగా 15,157 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 1,09,53,303 మంది కోలుకున్నారని మంత్రిత్వశాఖ పేర్కొంది. మరో 117 మంది వైరస్ ప్రభావంతో మృత్యువాతపడగా, మొత్తం మృతుల సంఖ్య 1,58,306కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,97,237 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1.74 శాతం ఉన్నాయని, రికవరీ రేటు 96.86 శాతం ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే డెత్ రేటు 1.40 శాతంగా ఉందని వివరించింది. టీకా డ్రైవ్‍లో భాగంగా 2,61,64,920 డోసుల వ్యాక్సిన్ వేసినట్లు వివరించింది.