దేశంలో రికార్డు స్థాయిలో మరణాలు..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మరణాలు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా మరణాలు మాత్రం తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. 24 గంటల్లో 2,67,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,54,96,330కు చేరింది. గడిచిన 24 గంటల్లో 4,529 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 2,93,248 మృతి చెందారు. దేశవ్యాప్తంగా 3,89,851 మంది కరోనా బారినుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 32,26,719 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 32,03,01,177 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఇప్పటి వరకు టీకా డ్రైవ్‍లో భాగంగా 18,58,09,302 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.