24 గంటల్లో 12,881 పాజిటివ్ కేసులు

గడిచిన 24 గంటల్లో దేశంలో 12,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ నుంచి తాజాగా 11,987 మంది కోలుకున్నారని కేంద్రం తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,50,201కు చేరగా.. 1,06,56,845 మంది కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో మరో 101 మంది మృత్యువాతపడగా..మృతుల సంఖ్య 1,56,014కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,37,342 క్రియాశీల కేసులున్నాయని పేర్కొంది. టీకా డ్రైవ్‍లో భాగంగా ఇప్పటి వరకు 94,22,228 వ్యాక్సిన్ వేసినట్లు చెప్పింది.