అమెరికా, బ్రెజిల్ తర్వాత.. భారత్ లోనే

దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. ప్రతిరోజూ మూడు వేలకు పైగా మరణాలు సంభవిస్తుండగా, తాజాగా ఆ సంఖ్య నాలుగు వేలు దాటింది. దీంతో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఒక్క రోజులో నాలుగు వేలకు పైగా కరోనా మరణాలు నమోదవడం భారత్‍లోనే కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,01,078 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 4,187 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2,34,083కు చేరింది. దేశంలో ఇప్పటి వరకు 1,79,30,960 మంది బాధితులు కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 37,23,446 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు 16,73,46,544 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.