దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజులోనే

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటింది. గడచిన 24 గంటల్లో 1,84,372 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1027 మంది మృతి చెందారు. కరోనా బాధితుల సంఖ్య 1,38,73,825కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 13,65,704 యాక్టివ్ కేసులుండగా, వైరస్ సోకి ఇప్పటి వరకు 1,72,085 మంది మృతి చెందారు. 1,23,36,036 మంది బాధితులు డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా నిన్న 26,46,528 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దాంతో ఇప్పటి వరకు టీకాలు తీసుకున్నవారి సంఖ్య 11,11,79,578కి చేరింది.