24 గంటల్లో 11,067 కొత్త కేసులు…

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,067 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,58,371కు చేరింది. కొత్తగా 13,087 మంది వైరస్ నుంచి డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,05,61,608 మంది కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో మరో 94 మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,55,252కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,41,511 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 66,11,561 మందికి వ్యాక్సిన్ వేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా ఒకే రోజు దేశవ్యాప్తంగా 7,36,903 కరోనా నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 20,33,24,655 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు చెప్పింది.