అమెరికా కంటే మనమే ముందు!

కరోనా వ్యాక్సినేషన్‍లో అమెరికాను మించిపోయింది ఇండియా. జూన్ 28 నాటికి ఇండియాలో 32,36,63,297 డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు. అదే అమెరికాలో ఇదే సమయానికి 32,33,27,328 డోసుల వ్యాక్సిన్ వేశారు. అయితే అమెరికా కంటే వేగంగా మన దగ్గర వ్యాక్సినేషన్ సాగుతోంది. అమెరికా డిసెంబర్ 14న వ్యాక్సిన్లు ఇవ్వడం ప్రారంభించగా.. ఇండియాలో జనవరి 16న మొదలైంది. ఆదివారం 17.21 లక్షల డోసుల వ్యాక్సిన్ ఇవ్వడంతో ఇండియా ఈ రికార్డు సాధించింది.