భారత్ మరో కీలక మైలురాయిని దాటింది

కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో కీలక మైలురాయిని దాటింది. జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభించిన వ్యాక్సినేసన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 75 కోట్ల డోసులకు పైగా పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడిరచారు. ఇదే రేటు కొనసాగితే డిసెంబర్ నాటికి 43 శాతం దేశ ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తవుతుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ మంత్రం ప్రపంచంలోనే భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొత్త రికార్డులు సృష్టిస్తోందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవం జరుపుకొంటున్న తరుణంలో 75 కోట్ల టీకా డోసులు పంపిణీ జరిగిందని పేర్కొన్నారు.