భారత్ మరో అరుదైన ఘనత : ప్రధాని

భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. కరోనా మహ్మారి వ్యాప్తి అరికట్టే టీకా పంపిణీలో 150 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్ల డించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో గల చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ రెండో క్యాంపస్‌ను ప్రధాని వీడియో కాన్ఫరెన్స ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ రోజు భారత్ మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు దేశంలో 150 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశాం. టీకాలకు అర్హులైన వారిలో 90 శాతానికి పైగా ప్రజలు తొలి డోసు అందుకున్నారు. 15-18 ఏళ్ల వయస్సు వారికి టీకా పంపిణీ కూడా శరవేగంగా కొనసాగుతోంది. తొలి ఐదు రోజుల్లోనే 1.5 కోట్లకు పైగా టీనేజర్లు తొలి డోసు తీసుకున్నారు అని తెలిపారు.