కరోనా బాధితులకు రూ.2 కోట్ల విరాళం

కరోనా సెకండ్‍వేవ్ దేశాన్ని ఇబ్బందులపాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా కోరల్లో చిక్కుకుని ప్రజలంతా విలవిలలాడుతున్నారు. ఆక్సిజన్ కొరత దగ్గరి నుండి బెడ్లు లభించకపోవడం, మందులు అందుబాటులో లేకపోవడం గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. దేశంలో ఉన్న పరిస్థితులను చూసి చాలామంది సెలబ్రిటీలు చలించిపోతున్నారు. ఆపద కాలంలో మేమున్నామంటూ తోచినంత సాయం చేస్తున్నారు. ఇక ఇప్పుడు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా జాయిన్ అయ్యాడు. కరోనా పేషెంట్లకు తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. కరోనా బాధితుల కోసం రూ.2 కోట్ల విరాళం ప్రకటించడంతో పాటు ఫండ్ రైజింగ్ కోసం స్పెషల్ క్యాంపెయిన్ చేపడతానని కోహ్లీ చెప్పాడు. ఐపీఎల్ కూడా వాయిదా పడటంతో ఫ్రీగా ఉన్న విరాట్.. తన భార్య అనుష్కతో కలిసి సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. దీంట్లో అందరూ జాయిన్ కావొచ్చని తెలిపారు. దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభించాడు.