దేశంలో 4 లక్షలు దాటిన కేసులు

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,14,188 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,14,91,598కు చేరాయి. ఇందులో 1,76,12,351 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 36,45,164 కేసులు యాక్టివ్‍గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 3,915 మంది మరణించడంతో మొత్తం మరణాలు 2,34,083కి పెరిగాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 16,49,73,058 మందికి టీకా పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.