ఒకటి కంటే.. రెండు వాళ్లే ఎక్కువ : కేంద్రం

భారత్‌లో నిర్విరామంగా కొనసాగుతున్న కరోనా టీకా రికార్డును నమోదు చేసుకుంది. ఒక డోసు తీసుకున్న వారి సంఖ్యతో పోలిస్తే రెండు డోస్‌లు తీసుకున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదైంది. దేశంలో వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారి సంఖ్య సింగిల్ డోస్ వారి సంఖ్యను దాటడం ఇదే తొలిసారి అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడిరచారు. ఇప్పటిదాకా 37,45,68,477 మంది సింగిల్ డోస్ తీసుకున్నారు. రెండు డోస్‌లు తీసుకున్న వయోజనుల సంఖ్య 38,11,55,604 దాటిందని ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. ఇప్పటిదాకా 113.68 కోట్ల డోస్‌లను ప్రభుత్వం అందజేసింది.