అమెరికా టీకాకు.. భారత్‍లో పరీక్షలు

అమెరికాకు చెందిన హెచ్‍బీటీ బయో కార్ప్, తాము అభివృద్ధి చేసిన కరోనా టీకాపై భారత్‍లో తొలి/ రెండో దశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్తో కలిసి తయారు చేసిన ఈ టీకా పాశ్చాత్య దేశాలలో తయారు చేసిన ఇతర టీకాలతో పోలిస్తే అందుబాటు ధరలో ఉంటుందని అంచనా. 2020 జులైలో హెచ్‍బీటీ బయో, జెన్నోవాలు కలిసి టీకా అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో కింద భారత్‍లో టీకాలను మార్కెట్ చేయడానికి జెన్నోవాకు హక్కులు లభించాయి. మాకు జెన్నోవాకు ఈ పరీక్షలు ప్రధాన మైలురాయిలాంటివని హెచ్‍బీటీ బయో సీఈఓ సీవ్ రీడ్ పేర్కొన్నారు. కాగా, అమెరికా, బ్రెజిల్‍లలోనూ ఈ ఏడాది హెచ్‍బీటీ బయోకు చెందిన టీకాకు సంబంధించి క్లినికల్ పరీక్షలు జరిగే అవకాశం ఉంది.