గ్రీన్ టీతో .. కరోనా దూరం

గ్రీన్ టీ మీకు రోజూ తాగే అలవాటు ఉందా? అయితే కరోనాపై మరో ఓ అడుగు ముందున్నట్టే. ఇమ్యూనిటీని పెంచడంలో గ్రీన్ టీకి ప్రత్యేక స్థానం ఉందని, అది కరోనాపై పోరులో కీలక పాత్ర పోషిస్తుందనని శ్యాన్ సీ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడయ్యింది. కొవిడ్‍ను నియంత్రించే నిరోధకాలు గ్రీన్ టీలో ఉన్నట్లు తేలింది. పురాతన కాలం నుంచి ప్రకృతి అందించే శక్తివంతమైన ఔషధాలు కోవిడ్‍పై పోరులో సహకరిస్తాయని తమ పరిశోధనలో తేలినట్టు డాక్టర్ సురేష్ మోహన్‍కుమార్ చెప్పారు. కరోనా వైరస్‍పై పోరాడగలమని భావించిన కొన్ని ప్రకృతి సిద్ధమైన సమ్మేళానలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిశీలించామనీ, వాటిల్లో గ్రీన్ టీలో ఉన్న ఒక సమ్మేళం మెరుగైనదని తేలినట్టు ఆయన వివరించారు. దీనిపై మరింత పరిశోధన చేసి కోవిడ్ 19 చికిత్సకు, నిరోదానికి ఇది ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో నిగ్గుతేల్చాల్చి వుందని ఆయన తెలిపారు.