కొవిడ్ టీకా తీసుకున్న ఏపీ గవర్నర్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత కొవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వైద్య సిబ్బంది వారికి కొవిడ్ టీకా వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ కరోనా కో -వాక్సిన్ తీసుకున్నానని, అసలు ఇంజక్షన్ తీసుకున్నట్టే లేదని తెలిపారు. కరోనాను నియంత్రించడానికి వైద్య సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారన్నారు. కరోనాకు ప్రపంచమే వణికపోయిన సందర్భాన్ని చూసామని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బాగానే ఉన్నట్లు చెప్పారు. అందరూ వాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటున్నానన్నారు. రెండో డోసు మార్చ్ 30 తర్వాత తీసుకోవాలని వైద్యులు సూచించారని గవర్నర్ తెలిపారు. టీకాకు సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్, విజయవాడ సబ్ కలెక్టర్ హెచ్ఎం.ధాన్యచంద్ర పరిశీలించారు.







