నిబంధనలు పాటించకపోతే ఇంటికే … గూగుల్ హెచ్చరిక

కోవిడ్-19 వ్యాకినేషన్ నిబంధనలు పాటించకపోతే జీతం కోల్పోవడంతో పాటు చివరికి ఉద్యోగం నుంచి కూడా తొలగించే విషయాన్ని పరిశీలించాల్సి వుంటుందని గూగుల్ హెచ్చరించింది. డిసెంబర్ 3లోగా ఉద్యోగులు తమ వ్యాక్సినేషన్ స్టెటస్‌ను వెల్లడించడం, రుజువులు చూపిస్తూ డాక్యుమెంటేషన్ అప్‌లోడ్ చేయాలని నిర్దేశించింది. ఆరోగ్య రీత్యా లేదా మతపరమైన సంప్రదాయాల రీత్యా ఏమైనా అవరోధాలుంటే ఆ వివరాలను సంబంధించిన పత్రాలను జత చేసి మినహాయింపు కోరాలని సూచించింది. వచ్చే జనవరి 18 నాటికి వ్యాక్సినేషన్ నిబంధనలు పాటించని ఉద్యోగులను నెల పాటు సెలవుకు పంపుతామని హెచ్చరించింది.