కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రెండో దశ వ్యాక్సినేషన్‍లో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‍రెడ్డి కొవిడ్ టీకా వేయించుకున్నారు. హైదరాబాద్‍లోని గాంధీ ఆసుపత్రిలో ఆయన కొవాగ్జిన్ టీకా తీసుకున్నారు. వైద్య సిబ్బంది ఆయనకు టీకా ఇచ్చారు. అందరూ కరోనా టీకా వేయించుకోవాలని, వాటిపై అపోహలు వద్దని కిషన్‍రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ప్రధాని సహా ప్రముఖులందరూ టీకా తీసుకుని ఆదర్శంగా నిలిచారని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీకా తీసుకునే సమయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా ఆయన పక్కనే ఉన్నారు. హైదరాబాద్‍లోని భారత్‍బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ టీకాను ఆయన వేయించుకున్నారు.